కళ్యాణికి తలనొప్పిగా మారిన బిగ్ బాస్ సూర్యకిరణ్ ఎలిమినేషన్?

బిగ్ బాస్ హౌస్ నుంచి మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిన సూర్యకిరణ్ మూలంగా తన మాజీ భార్య అయిన నటి కళ్యాణికి ప్రశాంతత లేకుండా పోయిందట. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన క్షణం నుంచి ఏ ఛానెల్ నీ వదలకుండా ఇంటర్వ్యూలు ఇస్తున్న సూర్యకిరణ్ తన మాజీ భార్యకి మాత్రం తలనొప్పిగా తయారయ్యాడని తెలుస్తుంది. అసలు ఏమి జరిగింది?

ఎవరీ సూర్యకిరణ్:

బిగ్ బాస్ సీజన్ 4 నుంచి మొదటి వారం లో ఎలిమినేట్ అయిన సూర్యకిరణ్ సినిమా దర్శకుడు అనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. సూర్య కిరణ్ చిన్నతనం నుంచీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. అతను బాలనటుడిగా 200లకు పైగా సినిమాల్లో నటించాడు. మెగాస్టార్ చిరంజీవితో సైతం కొండవీటి దొంగ, రాక్షసుడు తదితర చిత్రాల్లో బాలనటుడిగా పాత్రలు పోషించాడు. 20 ఏళ్ల క్రితం నాగార్జున మేనల్లుడు సుమంత్ నటించిన “సత్యం” సినిమాకి ఇతనే దర్శకుడు. ఆ సినిమా అప్పట్లో పెద్ద మ్యూజికల్ హిట్. కానీ ఆ తర్వాత సూర్యకిరణ్ తీసిన ఏ సినిమా కూడా విజయం సాధించలేదు. దానితో కొంత కాలం తర్వాత ఆయన సినిమాలకి దూరం కావలసి వచ్చింది. 10,12 ఏళ్ల నుంచైతే సూర్యకిరణ్ ని ప్రేక్షకులు మరిచిపోయారు అనే చెప్పాలి. అందుకే ఈయన బిగ్ బాస్ సీజన్ 4 లో కనిపించినా ప్రేక్షకులు చాలా మంది గుర్తుపట్టలేదు. ప్రేక్షకాదరణ పెద్దగా లేకపోవడంతో మొదటి వారంలోనే సూర్య కిరణ్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావలసి వచ్చింది.

ఈయన చెల్లి కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఆమె కూడా పసివాడి ప్రాణం వంటి పలు చిత్రాలలో బాలనటిగా చేయడంతో పాటు ఎన్నో టీవీ సీరియళ్లలో కూడా నటించి ప్రేక్షకులకి దగ్గరైంది.

నటి కళ్యాణి తో వివాహం:

ఈయన దర్శకుడి గా సినిమాలు చేస్తున్నప్పుడే అప్పట్లో సాంప్రదాయబద్ధ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కళ్యాణి తో వివాహం జరిగింది. కొంతకాలం అన్యోన్యంగానే సాగిన వీరి సంసారం తర్వాత విడాకులకు దారితీసింది. కారణం ఏమిటనేది ఇరువైపుల నుంచి ఎప్పుడూ బయటికి రాలేదు. ఇటు సూర్య కిరణ్, అటు కళ్యాణి ఇద్దరూ సినిమాలకి దూరం కావడంతో ప్రేక్షకులు కూడా వీరి వ్యవహారం పెద్దగా పట్టించుకోలేదు. అయితే సూర్య కిరణ్ బిగ్ బాస్ సీజన్ 4 లో తళుక్కున ప్రత్యక్షం కావడం తో కళ్యాణి పేరు మళ్లీ వార్తల్లోకెక్కింది.

కళ్యాణికి ఇబ్బందిగా మారుతున్న సూర్య కిరణ్ ఇంటర్వ్యూలు:

బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వచ్చింది మొదలు సూర్యకిరణ్ ఆ ఛానెల్, ఈ ఛానెల్ అనే తేడా లేకుండా ఎడాపెడా ఇంటర్వ్యూలు ఇచ్చేస్తూ ఉన్నాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ, తన మాజీ భార్య అయిన నటి కళ్యాణి తో విడాకులకు దారి తీసిన పరిస్థితుల గురించి యాంకర్స్ అడగగానే బాగా ఎమోషనల్ అయిపోతూ ఆయన చెప్పే సమాధానాలే కళ్యాణికి కోపం తెప్పిస్తున్నాయని సమాచారం. ఒకపక్క తన భార్య మీద విపరీతమైన ప్రేమని వ్యక్తపరుస్తూనే, మరోవైపు విడాకుల వ్యవహారంలో ఆమెనే మొత్తంగా బలిపశువును చేస్తున్నట్టు కనిపిస్తుంది. తనని కళ్యాణి వదిలి వెళ్ళిపోవడానికి కారణం తన ఆర్థిక పరిస్తితి దెబ్బ తినడమే అని ఆయన చెబుతూ కళ్యాణిని తప్పు పడుతున్నట్టు కనిపిస్తుంది. ఎప్పుడో 9 ఏళ్ల క్రితం ముగిసిన వ్యవహారం గురించి ఇప్పుడు ఆయన మాట్లాడటం కళ్యాణికి ఇబ్బందిగా ఉందంట. దీనికి సంబంధించి కళ్యాణి మేనేజేర్ కూడా సూర్య కిరణ్ కి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే కళ్యాణి మాత్రం ఈ విషయం పై ఇంకా నోరు మెదపలేదు. కళ్యాణి దీనికి ఏం వివరణ ఇస్తారో వేచి చూడాలి. ఏది ఏమైనా సూర్య కిరణ్ ఎలిమినేషన్ కళ్యాణికి పెద్ద తలనొప్పిగా మారిందనేది మాత్రం నిజం. ఎంకి పెళ్లి సుబ్బి చావుకి రావడం అంటే ఇదేనేమో.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

satta king 786