పవన్ కళ్యాణ్ లో నిజాయతీ ఎక్కడ?

పవన్ కళ్యాణ్ లో నిజంగానే నిజాయతీ ఉందా?
పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా ఆయన ఫ్యాన్స్ ఆయన గురించి గొప్పగా చెప్పుకునే విషయం ఆయన నిజాయితీపరుడని. రాజకీయాల్లో సాధారణంగానే నిజాయతీ తక్కువ కాబట్టి ఆయన, ఆయన ఫ్యాన్స్ దీన్నే ప్రధమాస్త్రంగా ఎప్పుడూ ఉపయోగించుకుంటూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ నిజంగానే అంత నిజాయతీ పరుడా? పవన్ లో నిజాయతీ ఎంత అనేది ఎలా బయటపడుతుంది? పవన్ కళ్యాణ్ ని నిజాయతీ పరుడిగా ఆయన భజన బ్యాచ్ సృష్టించిందా?
అసలు పవన్ కళ్యాణ్ లో నిజాయతీ ఎక్కడ కనిపించింది?
ఆయన భజన చేసే కొందరు వ్యక్తులు తరచూ పవన్ కళ్యాణ్ ని నిజాయతీకి మారుపేరుగా ప్రకటించుకోవడం తప్ప ఆయన నిజాయతీ ఎప్పుడు బయటపడింది? ఒక మనిషి నిజాయతీ బయట పడాలంటే ఆ వ్యక్తికి అవినీతి చేసే అవకాశం రావాలి. అవకాశం వచ్చినా కూడా అవినీతికి పాల్పడకుండా ఉండటమే నిజాయతీ అంటే. అలాంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ కి ఎదురు కావడానికి ఆస్కారం ఎక్కడ? సినిమా వారికి అవినీతి చేయడానికి అవకాశం, అవసరం ఏముంటుంది? రాజకీయాల్లో ఆయన ఇంకా ఒక పదవిని కూడా చూడలేదు కాబట్టి అక్కడ నిరూపించుకునే అవకాశం లేదు. ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలని చూసే కొందరు చెంచాలు మాటిమాటికీ ఆయన్ని నిజాయతీ పరుడు అని ప్రకటించడమే కానీ ఆయన నిజంగా నిజాయతీ పరుడు అని ప్రజలు భావించే విధంగా సంఘటనలు ఏమీ జరగలేదు.
పవన్ చేసే ఏ పనిలో నిజాయతీ కనిపించింది?
ఏడాదికో పార్టీ తో జత కడతాడు. ఒక్కో వేదిక పై ఒక్కోలా మాట్లాడుతాడు. ఒక ప్రాంతంలో ఒకలా, మరొక ప్రాంతంలో మరోలా మాట్లాడుతాడు. ఇంగ్లీష్ మీడియం వద్దంటాడు. తన పిల్లల్ని ఇంగ్లీషులోనే చదివిస్తాడు. ఆయన భజన్ బ్యాచ్ తనని ఇచ్చిన మాట తప్పని వ్యక్తిగా చెబుతారు. కానీ ఆయన చేసుకున్న బహు పెళ్లిళ్లు, ఆయన జత కట్టిన వివిధ సిద్ధాంతాల పార్టీలు మరొక విధంగా చెబుతున్నాయి. ఆయన పార్టీ కి ఒక సిధ్ధాంతం ఉండదు. సొంత అన్న గొప్పతనం ఒప్పుకోలేడు. ఇంక పవన్ లో నిజాయతీ ఏంటి?
పవన్ లో నిజంగానే సేవా గుణం ఉందా?
పవన్ సేవా కార్యక్రమాల్లో ముందుంటాడని ఆయన ఫ్యాన్స్ గొప్పలు చెప్పుకోవడమే కానీ సాధారణ ప్రజలకి అది ఎక్కడా కనిపించదు. ఎక్కడైనా విపత్తు జరిగితే అందరూ స్పందించినట్టు గానే ఆయన కూడా ముఖ్యమంత్రి సహాయనిధికో, ప్రధానమంత్రి సహాయనిధికో కొంత డబ్బు ఇచ్చి చేతులు దులుపుకుంటారు. అది కూడా చేయకపోతే ఫ్యాన్స్ దగ్గర కుదరదు కాబట్టి. కానీ నిజంగా సేవా గుణం ఉంటే ఆయనకి ఉన్న followingతో ఆయనే ముందుండి ఎంతో చేయొచ్చు. సోనూ సూద్ లాంటి ఒక మామూలు నటుడే ఇంత చేస్తుంటే, నిజంగా సేవ చేయాలనే తపన ఉంటే పవన్ కళ్యాణ్ ఇంకెంత చేయొచ్చు.
పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు టాక్స్ కుదిరినంత ఎలా ఎగ్గొడదామా అని చూసే ప్రతి ఒక్క వ్యక్తి అవినీతిపరుడే..