చంద్రన్నకి అంత దమ్ము ఉందా..!!??

తెలుగుదేశం పార్టీ ముంగిట ఒక అద్భుత అవకాశం..🚪🚪
కానీ చేజిక్కించుకుని చంద్రబాబు హీరో అవ్వగలడా?!
ఇంతవరకూ ఏ ప్రతిపక్ష పార్టీకీ దక్కని సువర్ణావకాశం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి దక్కింది. 2019 general elections లో చిత్తుచిత్తుగా ఓడిపోయిన పార్టీకి, మళ్లీ మనుగడ ఉంటుందో, ఉండదో అని రోజు చస్తూ బ్రతుకుతున్న పార్టీకి, మూడు రాజధానుల మూలంగా ఒక అద్భుత అవకాశం దొరికింది.
అదేంటంటే….
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి Y.S.జగన్ గారు మూడు రాజధానుల ప్రతిపాదన తేవడం, దాన్ని తెలుగుదేశం పార్టీ, అమరావతి ప్రాంత భూములిచ్చిన రైతులు వ్యతిరేకించడం అందరికీ తెలిసిందే. రెండు రోజుల క్రితం ఆ ప్రతిపాదనని గవర్నర్ ఆమోదించడం కూడా జరిగిపోయింది. అయితే మళ్లీ తెలుగుదేశం పార్టీ దీనిని తీవ్రంగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే. వారు మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది అని వాదిస్తున్నారు. వారికి అంత నమ్మకం ఉంటే, అది నిజమే అని వారు నిజంగా నమ్మితే, వారికి ఇంతకన్నా మంచి ఛాన్స్ మళ్లీ రాదు.
వారికి అదృష్టశాత్తూ రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల నుంచి ఒకరో ఇద్దరో MLA లు గెలిచే ఉన్నారు. వారందరితో రాజీనామా చేయించి, Capital ని mandate గా పెట్టీ elections కి పోతే, వారనుకుంటున్న విధంగా రాష్ట్రం మొత్తం అదే భావనలో ఉంటే bumper majority తో గెలిచే chance ఉంది. దాంతో జగన్ గారు మనసు మార్చుకునే అవకాశం ఉంది. ఒకవేళ జగన్ గారి మీద ఏం effect లేకపోయినా ప్రజల్లో ఆయన villain అవుతారు. మీరు heroes అవుతారు. జవసత్వాలు పోయిన పార్టీకి కొత్త ఊపిరి వస్తుంది. Jumping Jilanis ఓపిక పట్టే అవకాశం ఉంటుంది. నిరాశ లో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతున్న కార్యకర్తల్లో ఎంతో కొంత ఉత్తేజం పుడుతుంది.
ఒకవేళ ఇలా జరగకుండా SCENE REVERSE అయినా కూడా నిండా మునిగినోడికి చలేంటి ఇంకా..!! ఇప్పుడు ఆ పార్టీకి కొత్తగా పోయేదేమీ లేదు కూడా.