బడా హీరోల అడ్డగోలు పారితోషికాలకి గండి కొట్టనున్న OTT..!?

పెద్ద స్టార్ ల రెమ్యూనరేషన్ కి OTT బ్రేక్ చెప్పనుందా?
ఒకప్పుడు హీరో రెమ్యూనరేషన్ మిగతా ఆర్టిస్ట్ ల పేమెంట్ కన్నా కొద్దిగా ఎక్కువగా ఉండేది. హీరోయిన్ ది ఆ తరువాత స్థానంలో ఉండేది. ఇద్దరికీ భారీగా వ్యత్యాసం అయితే పెద్దగా ఉండేది కాదు. కొన్నిసార్లు పాత్ర నిడివి, ప్రాముఖ్యత బట్టి హీరో కన్నా హీరోయిన్ కే ఎక్కువ పారితోషికం ఇచ్చిన సందర్బాలు కోకొల్లలు. అయితే ఇప్పుడు ఒక పెద్ద హీరో రెమ్యూనరేషన్ అంటే సినిమా మొత్తం బడ్జెట్ కన్నా ఎక్కువే. అసలు హీరో, హీరోయిన్ రెమ్యూనరేషన్ కి ఎక్కడా పొంతనే లేదు. ఈ విధమైన అడ్డగోలు పరిస్థితి చాలా కాలంగా సినిమా ఇండస్ట్రీ లో కొనసాగుతూ వస్తుంది. అయితే ఇప్పుడు OTT పుంజుకుంటున్న సమయం లో హీరో ల రెమ్యునరేషన్ ఇలాగే అడ్డగోలుగా ఉండబోతుందా? లేక పరిస్థితి మారనుందా?
అసలు రెమ్యూనరేషన్లు ఇంతగా పెరగడానికి కారణం?
సినిమా వ్యాపారం మీద అవగాహన లేని నిర్మాతలే ఇలా సినిమా నిర్మాణం అడ్డగోలుగా తయారవడానికి కారణం. నిర్మాత అంటే ఒక సినిమా నిర్మాణానికి అయ్యే ఖర్చు అంతా పెట్టేవాడు. వారి డబ్బుతోనే సినిమా తీయడం జరుగుతుంది. అలాంటి నిర్మాత ఎంత జాగ్రత్తగా, పొదుపుగా ఉండాలి. ఒకప్పటి నిర్మాతలు అలాగే ఉండేవారు. వారే శాసించే వారు. వారే నటీనటుల పారితోషికం నిర్ణయించే వారు. ఎవరైనా అతి చేస్తే వారిని పీకేసి వేరే వారిని పెట్టేవారు. నిర్మాతలు నటులని స్టార్స్ ని చేసేవారు. స్టార్స్ అయ్యాక వారు తోక జాడిస్తే, ఆ తోక కత్తిరించి ఇంకో నటుడిని తీసుకు వచ్చేవారు. అంత powerful గా నిర్మాతలు అప్పట్లో ఉండేవారు. అలా ఉన్నారు కాబట్టే వారు పెద్ద పెద్ద స్టూడియోస్ కట్టి సినిమా ఉద్ధరణ కి తోడ్పడ్డారు.
మరి ఇప్పటి నిర్మాతలు..?
ప్రొడ్యూసర్ నెత్తి మీద బండ డిస్ట్రిబ్యూటర్ మీద పడింది…
సినిమా నిర్మాణం భారీగా పడిపోవడంతో ప్రొడ్యూసర్లు కొత్త ఎత్తుగడ అందుకున్నారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు, హీరోల దర్శకుల పేర్లు చెప్పి సినిమా ని భారీ మొత్తంలో డిస్ట్రిబ్యూటర్ కి అమ్మడం మొదలు పెట్టారు నిర్మాతలు. ఎంత ఎక్కువ కి అమ్మినా వారికి దక్కే లాభం పట్టుమని 15-20 % దాటదు. కాకపోతే సినిమా flop అయితే ఇప్పుడు నష్టపోయేది నిర్మాత కాదు డిస్ట్రిబ్యూటర్. ఎటు తిరిగీ చూసినా దీనికి కారణం అధిక పారితోషికాలు మాత్రమే.
హీరో కి తోడు దర్శకుడు:
పై పెచ్చు కళ మీద, ప్రేక్షకుల మీద ప్రేమ ఒలక పోస్తూ hypocrisy:
చేస్తున్నది ఫక్తు బిజినెస్ అయినా కూడా ఒక్క హీరో కానీ, దర్శకుడు కానీ ఆ మాట చెప్పడు. వాల్లేదో జనాలని ఉద్ధరించడానికే సినిమాలు తీస్తునట్టు buildup ఇస్తారు. అంత ప్రేమ సినిమా మీద, అభిమానుల మీద ఉంటే తక్కువ రెమ్యూనరేషన్ తో సినిమా చేసి, ఒకవేళ పెద్ద హిట్ అయి లాభాలు వస్తే అప్పుడు వాటా తీసుకోవచ్చు కదా? అలా కుదరదు మళ్లీ వీళ్ళకి. వాళ్ళ సినిమా మీద వాళ్ళకే నమ్మకం ఉండదు.
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం?
వీళ్ళ ధన దాహానికి ఎంతో మంది నిర్మాతలు నిండా మునిగాక, థియేటర్లు ఎన్నో మూతపడ్డ తరువాత, OTT వచ్చి సినిమా థియేటర్లను మింగేస్తున్న తరుణంలో ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగా పరిస్థితిలో మార్పు కనపడుతుంది. హీరోలే ప్రొడ్యూసర్స్ అవతారం ఎత్తడం మొదలు పెట్టారు. ఇది ఎంతో కొంత శుభ పరిణామమే అయినా ఇప్పటికే నాశనం అయిన ఫిల్మ్ ఇండస్ట్రీ కోలుకోవడం మాత్రం కష్టం. సినిమా థియేటర్ కి ఈ కరోనా తగ్గిన తర్వాత అయినా ప్రేక్షకుడు వస్తాడా అనేది జవాబు చెప్పలేని ప్రశ్న. OTT రూపంలో ఇంటి నుంచే సినిమా చూసే అవకాశం ఉన్న ఈ రోజుల్లో వందలకి వందలు పెట్టీ ఒక సినిమా చూస్తారా అనేది పెద్ద ప్రశ్న. బాహుబలి లాంటి సినిమాల సంగతి ఏమో కానీ మామూలు సినిమాలు థియేటర్లలో నిలదొక్కుకోవడం ఎంతైనా సవాలే….
అగ్ర హీరోలు, దర్శకుల రెమ్యూనరేషన్ కారణంగానే, ఆ ఖర్చుని భర్తీ చేయడానికి టికెట్ రేట్లు పెంచుకున్నారు. ఇక పెరిగిన టికెట్ రేట్లు పెట్టీ సినిమా చూడడం కుదరని, ఇష్టం లేని ప్రజలు ఏకంగా టీవీ సీరియళ్ళ తో సరిపెట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా థియేటర్ నే ఇంటికే తెచ్చే digital technology రావడం తో ఇక థియేటర్లకు గడ్డు కాలమే.. థియేటర్లు లేకుండా OTT లో రిలీజ్ అవుతున్నప్పుడు వారికి ఇంతింత పారితోషికాలు ఇచ్చే వారు కూడా తక్కువై పోతారు… ఏది ఏమైనా OTT రావడం ప్రేక్షకుడికీ, చిన్న హీరోలకి, సినిమా మీద నిజంగా ప్రేమతో సినిమా తీసే వారికీ ఎంత లాభమో ఇలా అద్దు అదుపు లేకుండా రెమ్యూనరేషన్ తీసుకునే బడా హీరోలకి అంతే నష్టం….