రాపాక లాంటి వాళ్ళను జగన్ పార్టీలోకి తీసుకుంటారా..?

రాపాక లాంటి వాళ్ళను జగన్ పార్టీలోకి ఆహ్వానిస్తారా?
ఇన్నాళ్లు పార్టీ కోసం సేవచేసిన వారిని పక్కన పెడతారా?
రాపాకవరప్రసాదరావు ఎమ్మెల్యేగా రాజీనామా చేసి వైసీపీలోకి వస్తారా?
2019 ఎన్నికలలో జనసేన పార్టీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా రాజోలు నియోజకవర్గం నుంచి రాపాకవరప్రసాదరావు గెలుపొందారు. ఆనాటి నుంచి అటు జనసేన గానీ, ఇటు రాపాక గానీ ఎవరు కూడా సత్సంంధాలు కలిగి ఉన్నట్లు కనపడలేదు. రాపాక ఎల్లప్పుడూ ప్రభుత్వం తరపు ఎమ్మెల్యేగానే మెలుగుతూ వచ్చారు. అయితే ఆయన జనసేన కి రాజీనామా చేయలేదు, జనసేన కూడా ఆయన్ని పార్టీ నుంచి తొలగించలేదు. రాజ్యసభ ఎన్నికలలో పార్టీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ తరపున ఓటు వేసినప్పటికీ పవన్ కళ్యాణ్ ఈయన్ని పార్టీ నుంచి తొలగించలేదు. అయితే ఇప్పుడు రాపాక మాట్లాడినట్లు viral అవుతున్న ఒక విడియోలో ఏకంగా రాజోలు వైసిపిలోని మూడు వర్గాల్లో తనది కూడా ఒకటని చెప్పడం చర్చనీయాంశం అయింది. ఇప్పుడు జనసేన ఎలా స్పందిస్తుందో అన్న విషయం కన్నా జగన్ ఎలా స్పందిస్తారు అనే అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.
జగన్ రాపాకను పార్టీలోకి తీసుకుంటారా?
ఈ ప్రశ్న ఇంతకముందు అయితే అసలు వినిపించేది కాదేమో. పక్క పార్టీ ముఖ్యనాయకులు, అందులోనూ గెలిచిన నాయకులు అంటే ఎదురిచ్చి మరీ పార్టీలోకి స్వాగతం పలికేవారు. అయితే జగన్ దానికి పూర్తి విరుద్ధం అని తెలిసిందే. ఆయన పార్టీలోకి ఎవరు రావాలన్నా పార్టీతో పాటు వాళ్ల పదవులకి కూడా రాజీనామా చేసి రావాలనే షరతు ఉంది. అందుకే చాలా మంది ప్రతిపక్ష పార్టీ నేతలు ఇంకా ఆయా పార్టీల్లోనే కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు రాపాక చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. రాపాకవరప్రసాదరావు రాజీనామా చేస్తారా? చేయకపోతే జగన్ తీసుకుంటారా?
అసలు రాపాక ను పార్టీలోకి తీసుకోవడం మంచిదేనా?
అవతలి పార్టీ వారిని తీసుకుంటే వచ్చే లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి. ఇప్పుడు రాపాక ను రాజీనామా చేయించి వైసీపీ నుంచి పోటీ చేయిస్తే వైసీపీ పార్టీ నుంచి గత ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్ధి నుంచి వ్యతిరేకత వస్తుంది. అయినా పార్టీ ప్రయోజనాల కోసం అలోచించినా కూడా రాపాక ఏమీ భారీ majority తో గెలిచిన వ్యక్తేమి కాదు. కేవలం 800 పై చిలుకు majority తో గెలిచిన candidate. పోనీ కొడాలి నాని లాంటి బలమైన నాయకుడా అంటే అదీ కాదు. ఇలాంటి సాదాసీదా నాయకుడి కోసం పార్టీని నమ్ముకుని ఉన్నవారిని పక్కన పెడితే జగన కి ఉన్న credibility దెబ్బతింటుంది.
ఇలాంటి Jumping జిలానీలు జగన్ కి అవసరమా?
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి దూరడం రాపాక కి అలవాటుగా ఉంది. ఆయన ఎన్నో పార్టీలు మారారు. గత ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచి ఇప్పుడు అదే పార్టీని తిడుతున్న వ్యక్తిని తీసుకోవడం జగన్ కి ఏ విధంగానూ మంచిదికాదు. జగన్ ఇలాంటి jumping జిలానిలను ప్రోత్సహించకపోతేనే పార్టీకి ఎంతైనా మేలు.